TRINETHRAM NEWS

తాడేపల్లి వార్తలు.. జనవరి 18.
38 వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె – సామూహిక ప్రార్థనలతో నిరసన.
అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు, రిటైర్డ్ బెనిఫిట్స్, పెన్షన్ మొదలైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె నేటికి 38 వ రోజుకు చేరుకుంది. తాడేపల్లి మండల కేంద్రం నులకపేట తాసిల్దార్ కార్యాలయం సమ్మె శిబిరం వద్ద సామూహిక ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు.
సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, ఎపి రైతు సంఘం మండల కార్యదర్శి మోదుగుల శ్రీనివాసరెడ్డి, సిఐటియు నాయకులు దర్శనపు విజయ్ బాబు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సమ్మెకు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మంగళగిరి ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు వేముల దుర్గారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సరళ, తబితా, కిరణ్మయ్, మాణిక్యం, శ్రీదేవి, భవాని, సుజాత, లక్ష్మి, శోభా, వరలక్ష్మి, ఫాతిమా, మాధురి తదితరులు నాయకత్వం వహించారు.