ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 18 at 1.56.25 PM

TRINETHRAM NEWS

తాడేపల్లి

ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కొమ్మారెడ్డి కిరణ్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు,స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా గురువారం గుండిమెడ గ్రామ తెలుగుదేశం పార్టీ
ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడిపి తాడేపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ
అన్న నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఎన్టీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ
చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుండిమెడ తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు గుండిమెడ రమేష్ బాబు,గ్రామ పార్టీ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నామాతోటి రాంబాబు, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్ , పాటిబండ్ల నాగేశ్వరావు , తురకా సాంబశివరావు,తురకా నాగరాజు, దాసరి నరేష్, మందపాటి బాబురావు, కోపల్లె కుమార్ , అనుమోలు వెంకట్రావు , మెరుగుమల్లి సాంబశివరావు,
దున్న కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page