
తేదీ : 08/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య ఐటీ శాఖ ల మంత్రి నారా లోకేష్ అనడం జరిగింది. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ యూనివర్సిటీ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై వైస్ ఛాన్స్లార్ జీపి రాజశేఖర్ తో ఉండవల్లి లోని నివాసంలో లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ ఏడాది ఏప్రిల్26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉత్సవాల ప్రారంభ వేడుకలను నిర్వహించిన ఉన్నట్లు వీసి వివరించారు. 1986వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ ని స్థాపించారు. 2026 ఏప్రిల్ 26వ తేదీ వరకు ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ విజన్ ను వీసీ జిపి రాజశేఖర్ ఆవిష్కరించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. క్యూయస్ ర్యాంకింగ్స్ లో టాప్ – 100 స్థానం పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే ఖాళీలను చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన.శశిధర్, రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్ సిహెచ్ ఈ) చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి కళాశాల ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
