జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 09 at 14.40.10

TRINETHRAM NEWS

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

వాహనాల దారి మళ్లింపు వివరాలు:

1) నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్ళు భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుండి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్ళించడం జరిగింది.

2) హైదరాబాద్ వైపు నుండి ఒంగోలు వైపుకు వచ్చు భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా దారి మళ్ళించడం జరిగింది.

3) నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్ళు సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుండి నామ్ హైవే పై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లవలేను.

4) ఒంగోలు వైపు నుండి విశాఖపట్నం వైపు NH 16 పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట నుండి NH 216 పైకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపడం జరుగుతుంది.

5) ఒంగోలు వైపు నుండి విజయవాడ, గుంటూరు వైపు NH 16 పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లించడమైనది.

6) ఒంగోలు వైపు నుండి చిలకలూరిపేట వైపు వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా దారి మళ్లించడమైనది.

7) విశాఖపట్నం నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడమైనది.

8) గుంటూరు నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడమైనది.

9) చిలకలూరిపేట వైపు నుండి ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్ళు వాహనాలను పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడమైనది.

గమనిక:
1) 16 వ నంబర్ జాతీయ రహదారి పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుండి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబడవు కేవలం సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

2) అద్దంకి నుండి నాగులపాడు, వెంకటాపురం మీదుగా జాతీయ రహదారి పైకి ఏటువంటి వాహనాలను అనుమతించబడవు

3) ఈ ఆంక్షలు మార్చి 10న ఆదివారం ఉదయం 10 గంటల నుండి అమలులోకి వచ్చును.

You cannot copy content of this page