Sri Gayatri Brahmin Seva Sangam : అనపర్తి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారి వన సమారాధన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అనపర్తి :నవంబర్ 9 : అనపర్తి స్థానిక జిబిఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న మామిడితోటలో శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం వారి వన సమారాధన ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత భక్తిశ్రద్ధలతో శ్రీ తులసీదాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలతో పాటు మహిళలకు ఆటల పోటీలు మ్యూజిక్ చైర్ గేమ్ పాటల పోటీలు నిర్వహించి బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దంతుత్తి సత్య ప్రసాద్ మండపేట బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సుబ్రహ్మణ్యం అనపర్తి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గరికిపాటి సూర్యనారాయణ మూర్తి మారేళ్ల గంగరాజు శర్మ చాగంటి సుబ్రహ్మణ్యం నాగదేవర సూరిబాబు బ్రదర్స్ రెడ్డి సతీష్ చింత ఆనంద్ బొద్దవరపు శేషగిరి ఉమ్మెత్తల సుబ్బారావు పెద్దింటి వేణు చందు రంగాచార్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Anaparthi Sri Gayatri Brahmin Seva Sangam's Vana Samaradhana

You cannot copy content of this page

Scroll to Top