TRINETHRAM NEWS

తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి, పరిశీలకులు చింతల, మోకా
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం రామవరంలో జరిగిన “ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల” సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అనపర్తి నియోజకవర్గ పరిశీలకులు,రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ,అనపర్తి నియోజకవర్గం టిడిపి పరిశీలకులు మోకా ఆనంద్ సాగర్.

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ

రాబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరo,ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.అలాగే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతీ ఒక్కరూ సమయాత్తంగా ఉండాలని, అదే విధంగా గ్రామాలలో ప్రతి ఒక్క పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను కలసి మొదటి ప్రాధాన్యత ఓటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరo గారికి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా దిశా నిర్దేశం చేసిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Nallamilli