TRINETHRAM NEWS

An open letter of the labor unions on the occasion of the visit of Honorable Deputy Chief Minister Bhatti Vikramarka to Godavarikhani!

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశము గోదావరిఖని IFTU కార్యాలయంలో జరిగింది.
ఇట్టి సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగ లేక ద్వారా కార్మికులకు ప్రజలకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నాము!

ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తించిన బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి సింగరేణి కంపెనీకి అట్టి బొగ్గు బ్లాకుల ను ఇచ్చే విషయంపై మీ స్పందనను కోరుతున్నాము
150 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సింగరేణి కంపెనీ ఇవాళ దేశంలో ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతని సాధించింది.
కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించి అనేక రాష్ట్రాల్లో కోలిండియాలో ఉన్న బ్లాకుల ను ఇవాళ వేలంపాట ద్వారా బడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పుతున్నారు.

కానీ సింగరేణి కంపెనీ తన సొంత ఖర్చులతో సొంత నైపుణ్యంతో అనేక బ్లాకులను గుర్తించండి బ్లాకులను సింగరేణి కంపెనీ నడపడం ద్వారా అనేకమంది నిరుద్యోగ ఉపాధి ప్రజల అవసరాలు తీరనున్నాయి.
మా యొక్క విజ్ఞప్తిని పరిశీలించి సింగరేణి కంపెనీ గుర్తించిన సింగరేణి కేటాయించాలని గత నెల రోజుల నుండి సింగరేణి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినట్లయితే సింగరేణి కే ఇస్తామని అనేక హామీలు పలు సందర్భాల్లో ఇచ్చారు.

మీ హామీలకు అనుకూలంగా సింగరేణి కార్మిక వర్గం కోల్బెల్టు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చారు.
వారి ఆశలను వమ్ము చేయకుండా. మీ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్న కార్మిక సంఘాలకు మీరు పూర్తిగా సహకరించి కేంద్రంతో పోరాటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తారని మోడీ ప్రభుత్వం కోల్ ఇండియాలో గుజరాత్ లో నేరుగా వారికి ఎలా బ్లాకు ని కేటాయించారు సింగరేణికి కూడా అలాగే కేటాయించాలని మీపై ఆ బాధ్యత ఉందని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున అభిప్రాయపడుతున్నాము
ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్, టి శ్రీనివాస్, కృష్ణ, కామేర గట్టయ్య, కుమారస్వామి, జి రాములు, రత్నకుమార్, ఏ వెంకన్న,ఈ నరేష్, దావు రమేష్, బి అశోక్, దేవి సత్యం, శేఖర్. తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

An open letter of the labor unions on the occasion of the visit of Honorable Deputy Chief Minister Bhatti Vikramarka to Godavarikhani!