
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురబేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జెసిబి సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది.దీంతో ఆలయ నిర్వహకులు విగ్రహాన్ని ఆలయం వద్దకు చేర్చి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ విగ్రహం చాలా ప్రాచీనమైనదని ఆలయ అర్చకులు తెలిపారు. గతంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయని ఆ ప్రదేశంలో ఈ విగ్రహానికి గుడి కట్టిస్తామని ఆలయ నిర్వహకులు తెలిపారు.
