మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న తెలంగాణ బస్సుకు ప్రమాదం
Trinethram News : ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవదహనమయ్యారు. మిగతా వారిని స్వస్థలాల కు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నా యి.
ఉత్తరప్రదేశ్‌లోని మధుర- బృందావన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం బృందావన్‌లోని టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు గాయాల య్యాయి. ఫైర్ సేఫ్టీ సిస్టమ్‌తో మంటలను అదుపు చేసినా, అప్పటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లాకు చెందిన భక్తులతో మహాకుంభ స్నానం చేసి బస్సు తిరిగి వస్తున్నట్లు సమాచారం.
యాత్రికులను బైంసా రప్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చొరవ చూపారు. అక్కడి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. యాత్రికులను క్షేమంగా తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బృందావన్ అధికారులు. ప్రత్యేక వాహనాల ద్వారా యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App