TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, అంబేద్కర్ దళితులకు హక్కులను సాధించి పెట్టారని అన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తుంగలో తొక్కిందని, దానిని త్వరలోనే పునఃప్రారంభిస్తామని ప్రకటించారు.

విదేశాలలో చదవాలనే దళిత విద్యార్థుల కల.. కలగానే మిగిలిపోకూడదని.. అందరితోపాటు వారు కూడా మంచి ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు.

రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలియ జేశారు. అమరావతికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీలు, కాలేజీలను తీసుకు వస్తామని.. ఇంటికి దూరం అవుతామనే బెంగ, ఒత్తిడి విద్యార్థులకు ఇకపై ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ambedkar Foreign Education Scholarship Scheme