TRINETHRAM NEWS

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలన్న సీఎం వెల్లడించారు.

ఇన్​ఛార్జ్ మంత్రుల పర్యటనల్లో 3 పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Amaravati Reconstruction Works Modi