
అల్లూరి సీతారామరాజు జిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 2: షెడ్యూల్ ఆదివాసీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహిళ ,శిశు సంక్షేమ శాఖ విడుదల చేసిన నోటిపికేషన్ లో ఆదివాసులకు ఒక పోస్టు కూడా కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండిపడ్డారు.ఈ సందర్భంగా మంగళవారం అరకులోయలోని స్ధానిక విలేకరులతో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడారు.జిల్లా మహిళ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా మిషన్ వాత్సల్య నందు మంజూరైన పోస్టులకు గిరిజనేతరులతో భర్తీకి నోటిపికేషన్ జారీ చేశారని ఆదివాసులకు ఒక పోస్ట్ కూడా కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని తక్షణమే నోటిపికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు
జిల్లా పిల్లల రక్షణ అధికారి విభాగం లో సోషల్ వర్క్స్( 1) అవుట్ రీచ్ వర్క్స్( 1 ) ప్రత్యేక దత్తత ఏజెన్సీ (ఎస్ఎస్ఎ): విభాగంలో మేనేజర్, కోఆర్డినేటర్ (,1) డాక్టర్ పార్ట్ టైమ్ 1అయాస్ పోస్టులో ఒక్కటి కూడ ఆదివాసి గిరిజనులకు కేటాయించలేదన్నారు.మిషన్ శక్తి ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్లో పని చేయుటకు మానసిక సామాజిక సలహాదారు (స్త్రీ) 1 బహుళ ప్రయోజన సిబ్బంది / కుక్ (మహిళ) 1 సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ (మహిళ)1 పోస్టులో పూర్తి గా కాంట్రాక్ట్ పద్దతి పని చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఈ నోటిఫికేషన్ లో ఆదివాసులకు ఒక్క పోస్టు కూడా లేకపోవడం చాల దారుణమని పేర్కొన్నారు.ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
