మానుకోట అభివృద్ధికి నిధులు కేటాయించండి..
అసెంబ్లీలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్…
గిరిజన జిల్లా మానుకోట అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ ప్రభుత్వాన్నీ కోరారు.
అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఇనుగుర్తి గ్రామాన్ని మండలం చేస్తామని బీఆర్ ఎస్ కాలయాపన చేసి,రాజకీయ లబ్ది పొందారని, గ్రామ ప్రజల పోరాటం ఫలితంగా మండల ప్రకటన చేశారని అన్నారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం మూలంగా ఇనుగుర్తి మండల కేంద్రం అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉందన్నారు.
వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి ,ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్నారు.
గూడూరు మండలం లో బస్టాండ్ ఏర్పాటు కృషి చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App