జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 10 at 6.45.56 PM

TRINETHRAM NEWS

ఏఐ మాయాజాలం..!

శోభన్ బాబు గా

దిగ్గజ హీరో లుక్ అదిరిపోయిందంతే!

టాలీవుడ్‌లో చాలామంది హీరోలున్నారు. వాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే అందగాడు అనే మాట వస్తే మాత్రం దాదాపు ప్రతిఒక్కరూ చెప్పేమాట ఒక్కరి పేరు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ.. సినిమాల రూపంలో ఆయన సజీవంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నేపథ్యంలో ఆయన వీడియో ఒకటి వైరల్ అయిపోయింది.

మరి ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? పైన ఫొటోలో, దిగువన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శోభన్ బాబు. అవును తెలుగు సినిమాల్లో అందగాడు అనగానే గుర్తొచ్చేది ఈయనే. 1959లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈయన 1996 వరకు దాదాపు 230కి పైగా సినిమాల్లో హీరోగా, నటుడిగా చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.

సోగ్గాడు, దేవత లాంటి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో సరికొత్త వీడియోలు, ఫొటోలు రీక్రియేట్ చేస్తున్నారు. అలా కొందరు శోభన్ బాబుని ఈ సాంకేతిక ఉపయోగించి పలు వీడియోలు క్రియేట్ చేశారు.

బీచ్ ఒడ్డున సిక్స్ ప్యాక్‪‌తో నడిచొస్తున్న వీడియోని తాజాగా ఆర్జీవీ ట్వీట్ చేయగా ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. మరో వీడియోలో సూట్ వేసుకున్న లుక్ అయితే కేక పుట్టిస్తోంది.

You cannot copy content of this page