TRINETHRAM NEWS

Additional Collector of Local Bodies J. Aruna said that nutrition programs should be carried out successfully

పెద్దపల్లి, సెప్టెంబర్ -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పోషన్ మహ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు.

మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో 7వ రాష్ట్రీయ పోషణ మాసం (పోషణ మాహ్-2024) కార్యక్రమాలను ప్రారంభిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ల ను ఆవిష్కరించారు.

పోషణ్ మాసం కార్యక్రమం వివరాలు, షెడ్యూల్ గురించి పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ, పోషణ మాసం అనేది దేశవ్యాప్తంగా పోషకాహారంపై అవగాహన కల్పించడం , పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు బాల్య స్థితిలో ఉన్న యువతుల పోషక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేపడుతున్న ఒక గొప్ప కార్యక్రమని అన్నారు.

పోషణ మాసం కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ ఏడాది పోషణ మాసం ప్రత్యేకంగా గ్రోత్ వృద్ధి మానిటరింగ్, రక్తహీనత నివారణ, అనుబంధ ఆహారం, మరియు సాంకేతికత ఉపయోగం* వంటి అంశాలపై దృష్టి సారించనుంది.

పోషణ్ మాసం కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా, ప్రాజెక్ట్, మరియు ఆంగన్వాడీ కేంద్ర స్థాయిల్లో వివిధ కార్యకలాపాలు నిర్వహించబడతాయని, ఇందులో అనేక డిపార్ట్మెంట్లు కలిసి పని చేస్తూ, అవగాహన కార్యక్రమాలు, రక్తహీనత పరీక్షలు, క్రమపద్ధతిలో ఆహారం పంపిణీ, ఇతర ఆరోగ్యకరమైన చర్యలను అమలు చేయనున్నాయని, ప్రతి శాఖ ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని, అందరూ కలసికట్టుగా పనిచేసి పోషణ మాసాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

సొంత భవనాలలో న్యూట్రి గార్డెన్ పెంపొందించాలని అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ పోషణ మహ్-24 ఆక్టివిటీస్ కమ్యూనిటీ లెవెల్ లో ఒక పండగ వాతావరణంగా జరపాలని తెలిపారు.

జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ మాట్లాడుతూ ఈ పోషణ్ మహ్ కార్యక్రమం అంగన్వాడి సెంటర్ లెవెల్, ప్రాజెక్ట్ లెవెల్ లో ఇచ్చిన షెడ్యూలు ప్రతి ఒక్కరూ పాటించాలని, హోమ్ విజిట్స్ కూడా పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో , పెద్దపల్లి సిడిపిఓ కవిత, రామగుండం సిడిపిఓ అలేఖ్య, మంథని సిడిపిఓ పుష్పలత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ఆల్ సూపర్వైజర్స్, పోషణ అభియాన్ స్టాఫ్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Additional Collector of Local Bodies J. Aruna said that nutrition programs should be carried out successfully