AP DSC : మరికాసేపట్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

TRINETHRAM NEWS

పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

Trinethram News : అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ డీఎస్సీ షెడ్యూల్‌ను శనివారం (ఏప్రిల్‌ 19) ఎక్స్‌ ఖాతాలో విడుదల చేశారు.

కూటమి సర్కార్ మ్యానిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్‌ తన ట్వీట్‌లో వెల్లడించారు.

మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్‌ ఇదే..

  • ఆన్‌లైన్‌ ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు: ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు
  • మాక్‌ టెస్ట్‌లు: మే 20 నుంచి
  • హాల్‌టికెట్ల
  • డౌన్‌లోడ్‌ తేదీ: మే 30 నుంచి
  • డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు: జూన్‌ 6 నుంచి జులై 6 వరకు
  • ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక ‘కీ’ విడుదల
  • అభ్యంతరాల స్వీకరణ: ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
  • ఫైనల్‌ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల
  • మెరిట్‌ జాబితా: ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mega DSC notification to

You cannot copy content of this page

Scroll to Top