జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 03 at 16.34.03

TRINETHRAM NEWS

Additional collector of local bodies J. Aruna inspected the digging of plantation pits

పెద్దపల్లి, జూలై -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ బుధవారం పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటేందుకు తవ్వుతున్న గుంతలను పరిశీలించారు.

అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటే సమయంలో రోడ్డుకు ఇరువైపులా కొంత స్థలం విడిచిపెట్టి మొక్కలు నాటాలని, దానికి అనుగుణంగా గుంతలు తవ్వాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్ స్తంభాల వద్ద, వైర్ల క్రింద మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వరాదని అదనపు కలెక్టర్ సూచించారు.

అనంతరం పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజా పాలన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, పెద్దపల్లి ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Additional collector of local bodies J. Aruna inspected the digging of plantation pits

You cannot copy content of this page