TRINETHRAM NEWS

నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన మద్దతు ధరపై కొనుగోలు చేయాలి అదనపు కలెక్టర్ డి.వేణు

సుల్తానాబాద్, నవంబర్ -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన మద్దతు ధరపై కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు ఆదేశించారు.

బుధవారం అదనపు కలెక్టర్ డి.వేణు సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, భూపతి పూర్ , ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కట్టుదిట్టంగా నిర్వహించాలని , ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వివరాలు, వారు తీసుకువచ్చిన వడ్ల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, వడ్ల తేమశాతం ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలని ప్రమాణాల ప్రకారం 17 తేమ శాతం రాగానే వరి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మద్దతు ధర పై నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎటువంటి ఆలస్యం జరగడానికి వీలులేదని, కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల దృష్ట్యా పంట నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

కొనుగోలు చేసిన వడ్ల వివరాలను వెంటనే ఓపిఎంఎస్ లో నమోదు చేస్తూ రైతులకు త్వరగా ధాన్యం డబ్బుల చెల్లింపులు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App