ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 16 at 18.07.31

TRINETHRAM NEWS

గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్

• పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రాన్రిక్ పరికరాలకు, ఎలక్ట్రాన్రిక్ వాచ్లకు అనుమతి లేదు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని సబ్ డివిజన్ వ్యాప్తంగా 07 సెంటర్ల లో పరీక్ష రాయనున్న అభ్యర్ధులు

ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదు

పరీక్షా కేంద్రాల వద్ద( 144 సెక్షన్) 163 బన్స్ సెక్షన్ అమలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.జి.పి.యస్.సి.) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ –3 పరీక్షకు పోలీసు శాఖ తరపున్న అన్నిరకాల భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సబ్ డివిజన్ పరిధి రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జన్తు్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ మంథని. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జఫ్స్ గర్ల్స్ గోదావరిఖని అశోక్ నగర్ చైతన్య డిగ్రీ & పీజీ కాలేజ్ గోదావరిఖని, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ (గర్ల్స్ ) గోదావరిఖని, ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంట్ క్లియర్ స్కూల్ జ్యోతి నగర్ ఎన్టిపిసి, ZPHS ఎన్టిపిసి మొత్తం 07 సెంటర్లలో అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద (144 సెక్షన్) 163 BNS సెక్షన్ అమలులో ఉంటుదని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలో సభలు, ఊరేగింపులు, ర్యాలీలు లాంటివి నిర్వహించ కూడదని, అనవసరంగా గుంపులు గుంపులుగా ఎవ్వరూ కూడా పరీక్ష కేంద్రం పరిసరాలలో తిరగటానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని షాపు యజమానులకు సూచించారు.

అభ్యర్ధులకు సూచనలు:-

పరీక్ష రోజున అభ్యర్థులు ఉదయం 8:30 గంటల నుండి ఉదయం సెషన్‌కు మరియు మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం సెషన్‌కు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని, పరీక్ష మొదలు సమయం తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన ఎవ్వరిని లోపలికి అనుమతించడం జరగదు.

ఎగ్జామ్ కు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ నందున్న నియమనిబంధనాలు తప్పకుండా పాటించాలన్నారు.

అభ్యర్ధులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ఉద్యోగి గుర్తింపు కార్డ్/ఓటర్ గుర్తింపు కార్డ్ ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుందని అన్నారు.

అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూకున్నట్లైతే, పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు.

ఎగ్జామ్ రాయడానికి (బబ్లింగ్) బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ను మాత్రమే అనుమతిస్తారని అన్నారు.

ఎగ్జామ్స్ హాల్ లోనికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్స్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్స్, టాబ్లెట్స్, హియరింగ్ సొల్యూషన్స్ సంబంధించిన గాడ్జెట్స్ అనుమతించడం జరగదన్నారు.

ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత ఒంటిగంట వరకు ఎవ్వరిని బయటకు పంపడం జరగదని, అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నాపత్రం తమతో పాటు తీసుకువెళ్ళడానికి వీలుగా ఉంటుంది అన్నారు.

అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ చేసినట్లు తేలితే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page