TRINETHRAM NEWS

About 20 quintals of PDS rice illegally stored in Gangapur

గంగాపూర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్

అక్రమంగా తరలించడానికి సిద్ధంగా 40క్వింటాళ్ళ పిడియస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు.

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జోన్ మంథని పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి మంథని పట్టణం లయన్ గడ్డ ఏరియా లోని ఒక ఇంట్లో నుండి ట్రాలీ ద్వారా అక్రమంగా పిడిఎస్ రైస్ తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్సై మరియు సిబ్బంది ఆకస్మిత తనిఖీ చేయగా పిడిఎస్ రైస్ నింపిన ట్రాలీ ఒకటి గుర్తించడం జరిగింది.

దానిలో సుమారు 40 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ గలదు అట్టి పిడియస్ రైస్ సయ్యద్ అస్లాం కి చెందినదిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మంథని గంగాపూర్ గ్రామ శివారు ఏరియా లోని ఒక గుడిసె వేసి పిడియస్ బియ్యన్ని నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బంది తనిఖీ నిర్వహించగా బ్యాగ్ లలో నింపి ఉన్న 20 క్వింటాళ్ల పిడియస్ రైస్ రాచర్ల రమేష్ కి చెందినవి గా గుర్తించి పీడీస్ రైస్ స్వాధీన పరుచుకోవడం జరిగింది. రెండు ప్రాంతాలలో పట్టుకొన్న 60 క్వింటాళ్ల పిడియస్ రైస్, ట్రాలీ ని తదుపరి విచారణ నిమిత్తం మంథని పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది.

(నిందితుల వివరాలు)
సయ్యద్ అస్లాం s/o జమిల్ వయస్సు 40 ముస్లిం, లయన్ గడ్డ మంథని
(40 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, TS 12UB 7425 ట్రాలీ స్వాధీనం)
రాచర్ల రమేష్ S/o సత్యనారాయణ, 35yrs మంథని
(20 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం)

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

About 20 quintals of PDS rice illegally stored in Gangapur