TRINETHRAM NEWS

A woman undergoing treatment for a neurological disorder will receive Rs. 2,50,000/- to Madhuyashki Goud who was granted LoC

  • బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రం అందజేత

నరాల బలహీనతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మహిళకు సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన రూ. 2,50,000/- ఎల్ఓసీని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మధుయాష్కి గౌడ్ గారు మంజూరు చేయించారు. వనస్థలిపురం డివిజన్ శ్రీకృష్ణ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అయితగోని మంగమ్మ కొన్నాళ్లుగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నది. ఆమె అనారోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల నిమ్స్ ఆస్పత్రిలో చేరింది.

ఆమెకు చికిత్స అందించేందుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. మంగమ్మ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వారు వనస్థపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కుట్ల నరసింహ యాదవ్ గారితో కలిసి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారిని కలిసి పరిస్థితిని వివరించారు. మధుయాష్కి గౌడ్ గారు స్పందించి జిల్లా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ద్వారా రూ.

2,50,000/- ల సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసిని మంజూరు చేయించారు. ఈ మేరకు ఎల్ఓసి పత్రాన్ని మంగమ్మ కుమారుడు గణేష్ కు మధుయాష్కి గౌడ్ గారు శనివారం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మకుటం సదాశివుడు, బుడ్డ సత్యనారాయణ, లింగాల కిషోర్ గౌడ్, బద్దుల వేణుగోపాల్ యాదవ్, చెన్నగోని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A woman undergoing treatment for a neurological disorder will receive Rs. 2,50,000/- to Madhuyashki Goud who was granted LoC