TRINETHRAM NEWS

తేదీ : 18/01/2025.
విజయవంతమైన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్.
బుట్టాయిగూడెం : ( త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండల కేంద్ర సెంటర్ నుండి పోలవరం శాసనసభ్యులు , ఉమ్మడి జిల్లా
జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి , పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజలకు అవగాహన దిశగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డైనమిక్ శాసనసభ్యులు చీపురు పట్టి పారిశుధ్యం చెయ్యగా, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని చెప్పడం జరిగింది. శుభ్రత వలన అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటామని కొనియాడారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కు ప్రజలందరూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కార్యదర్శి మెట్ట. బాబురావు, ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు, పోలీస్ మరియు, ప్రభుత్వ అధిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App