గోదావరిఖని 1 వ టౌన్ పోలీస్
భూ వివాదం తో మనస్తాపం చెంది సింగరేణి కార్మికుని ఆత్మ హత్య.
కష్టపడి కొన్న భూమి లో వివాదం ఉండటం,అప్పుల బాధతో
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
విటల్ నగర్ కు చెందిన సింగరేనీ కార్మికుడు మాదంశెట్టి నర్సయ్య (58)విషం సేవించి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం జరిగింది.వన్ టౌన్ ఎస్ ఐ టి.శ్రీనివాస్ కథనం ప్రకారం ..సింగరేణి ఒ సి పి 3 సంస్థ లో డంపర్ ఆపరేటర్ గా పనిచేస్తూ విటల్ నగర్ లో ని సింగరేణి క్వార్టర్ లో నివాసం ఉండే నర్సయ్య 7 సంవత్సరాల క్రితం కరీంనగర్ బై పాస్ లో భూమి కొనుగోలు చేశాడు.ఐతే ఆ భూమి కొనుగోలు సమయంలో అప్పు చేశాడు.ఇదే సమయం లో అట్టి భూమి పై వివాదం నెలకొంది,దీంతో కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నాడు.అప్పుల భారం,స్థలం వివాదం లో ఉండటం తో మనస్తాపానికి గురైన నర్సయ్య ఇంట్లో ఎవరు లేని సమయం లో బుదవారం ఇంట్లో విషం సేవించాడు.దీంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.మృతునికి భార్య శోభ ,ఇద్దరు కుమార్తె లు,కుమారుడు రాకేష్ ఉన్నారు.రాకేష్ పిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఐ .టి .శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App