TRINETHRAM NEWS

A petition was given to the District Additional Collector to withdraw the decision to operate the radar station

ఈ సందర్భంగా POW జిల్లా కన్వీనర్ వై గీత, AIKMS జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవిలో 2900 ఎకరాల భూమిని రాడార్ స్టేషన్ VLF నిర్మాణానికి కేటాయించడం జరిగింది. ఈ అడవిలో 12 లక్షల చెట్లను తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటాలని పిలుపునివ్వడం సంతోషకరం కానీ ప్రాజెక్టుల పేరుతో అనేక ఔషధ గుణాలు కలిగిన 12 లక్షల చెట్లను తొలగించడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరం అదేవిధంగా వీఎల్ఎఫ్ వల్ల 60 నుండి 70 కిలోమీటర్ల దూరంలో రేడియేషన్ ప్రభావం ఉండటం చేత వికారాబాద్ జిల్లా భవిష్యత్తు ప్రమాదంలో పడనుంది కాబట్టి ఈ ప్రాంతంలో నేవీ ఆర్డర్ స్టేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చినటువంటి అనుమతులను అన్నిటిని రద్దు చేసి దామగుండం అడవిని

కాపాడగలరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దామగుండం అడవి నివాసి సత్యానంద స్వామి, AIKMS నాయకులు రాములు, PDSU జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, POW నాయకులు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A petition was given to the District Additional Collector to withdraw the decision to operate the radar station