
తేదీ : 18/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖలోని ఆర్కే బీచ్ లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించడం జరిగింది. బ్రేకులు పనిచేయకపోవడంతో బీచ్ రోడ్డులోని డివైడర్ ను ఢీ కొట్టి చిన్నపిల్లల పార్కులోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువమంది వాకింగ్ చేసేవాళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
