TRINETHRAM NEWS

A heated auto JAC of Unions

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిన్నటి అర్ధరాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో జే ఏ సి నాయకులను,కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేసిన ఆటో నాయకులను కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ర్ట ఆటో యూనియన్ల జె ఏ సి అధ్యక్షులు మంద రవికుమార్
వందలాది మంది ఆటో డ్రైవర్లు ఒక్కసారిగా అసెంబ్లీ ముందు ప్రత్యక్షమై నిరసన కార్యక్రమం తెలియచేస్తుండగా వెంటనే పోలీసులు నాయకులను కార్యకర్తను చదరగొట్టి ముఖ్యమైన నాయకులను అరెస్టు చేసి హైదారాబాద్ గోషామహల్ శైనయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేపు ఎల్లుండి జరిగే రెండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల కోసం ప్రత్యేక బడ్జెట్ వేయి కోట్ల రూపాయలను కేటాయించాలని అలాగే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలని 8000 ఉన్న ఇన్సూరెన్స్ ను వెయ్యి రూపాయలకు తగ్గించాలని ప్రత్యేక ఆటో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దార మధు,రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి శివరాజ్,రాష్ర్ట కార్యదర్శి వేల్పుల నరేష్,పెద్దపల్లి జిల్లా ఇంచార్జీ కాసిపేట రాజయ్య,రామగుండం కార్పోరేషన్ ఇంచార్జీ ఆంబాల శంకర్,డ్రైవర్స్ యండి ముక్తర్,కాసు శ్రీనివాస్,గట్ల వీరస్వామి,తిరుపతి,భద్రయ్య,చారి,మహేందర్,ప్రసాద్,జిలెందర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A heated auto JAC of Unions