Trinethram News : జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి గతంలో భర్త నుంచి విడిపోయింది. చంద్రశేఖర్ అలియాస్ సిద్ధుతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. తండ్రి వద్ద పిల్లలు ఉంటుండగా.. దసరా పండుగకు తల్లి ఇంటికి బాలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై సిద్ధు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దసరా నుంచి వేధింపులు సాగుతుండటంతో తాళలేక బాధితురాలు తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది
Related Posts
నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో
TRINETHRAM NEWS నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో Trinethram News : నిర్మల్ : బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు (టీఎస్ 18…
Film Chance : సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన మహిళకు
TRINETHRAM NEWS సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన మహిళకు Trinethram News : హైదరాబాద్ : జనవరి 18 : ఒక్క ఛాన్స్ అంటూ సినిమా రంగంలోకి అనేక మంది వస్తుంటారు. ఒక్క ఛాన్స్ రాకపోదా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.…