వంతడపల్లి అవతల వీధికి కల్వర్టు కట్టి రహదారి వేయాలి.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ :
అల్లూరి జిల్లా, జీకె వీధి మండలం, జర్రేల పంచాయతీ రోడ్డు వంతడపల్లి, నుండి అవతల వంతడపల్లి ఎక వీధి వరకు సుమారు రెండు కిలోమీటర్లు రహదారి మంజూరు చేసి, పారుతున్న కాలువపై వంతెన కట్టాలని, గ్రామస్తులు కోరుతున్నారు ,
పారుతున్న కాలువపై వంతెన లేక రహదారి సౌకర్యం లేక రోగుల కొరకు 108 కు ఫోన్ చేసిన రావడం లేదని, ఈ నేపథ్యంలో రోగులు మృతి చెందుతున్నారని, కొన్నిసార్లు గర్భిణీ, స్త్రీలను, రోగులను డోలి కట్టుకొని మెయిన్ రోడ్డు పైకి తీసుకుని వెళ్ళవలసి వస్తుందని, వెళ్లేటప్పుడు పొలాలు గట్టు పైన నడవాల్సి వస్తుంది అని ,
స్కూలుకు వెళ్లే చిన్నారులను తల్లిదండ్రులుగా దగ్గరుండి కాలువ దాటించి స్కూల్ కి, పంపించి మరల వ్యవసాయ పనులకు వెళ్ళిపోతున్నామని, సాయంత్రం పిల్లలు వచ్చేవరకు ఎంతో మనోవేదంతో బెంగ పడుతున్నామని, తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి లోపల వంతడపల్లి గ్రామానికి కాల్వ పై కల్వర్టు కట్టి రహదారి మంజూరు చేయాలని గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మణుగూరు మచ్చలింగం, వార్డ్ మెంబర్ బూడిద సలోమి, మరియు మణుగూరు కుసిరాజు, కొంత లింగం బొంజి బాబు, మణుగూరు చంటిబాబు, మణుగూరు నర్సింగరావు, మురళి చలపతిరావు, కిముడు భూలక్ష్మి, బూడిద బాలమ్మ ,మాజీ వార్డ్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App