జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 06 at 17.49.45

TRINETHRAM NEWS

పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలు భాగంగా జిల్లా కలెక్టర్ ఇంటికి చేరుకున్న బృందాలు

పెద్దపల్లి, నవంబర్ -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే హౌస్ లిస్టింగ్ లో భాగంగా బృందాలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష ఇంటికి హౌస్ లిస్టింగ్ చేస్తూ స్టిక్కర్ ను బృందాలు అతికించాయి నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు మూడు రోజులపాటు ప్రతి ఎనిమిరేటర్ తన పరిధిలోని 150 ఇండ్లను చెక్ చేసుకుని స్టిక్కర్ అతికించడం జరుగుతుందని, తరువాత ప్రతిరోజు 10 ఇండ్ల చొప్పున 15 రోజులలో సర్వే పూర్తి చేయాలని అన్నారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన సమాచారం సేకరించి చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page