కొవిడ్-19తో మూగబోయిన 15 ఏళ్ల బాలిక!
శివ శంకర్. చలువాది
కొవిడ్-19 సోకడంతో 15 ఏళ్ల బాలికకు మాటలు పడిపోయిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది.
కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్-2 వైరస్ నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇది సంకేతమని వైద్యులు తెలిపారు.
ఆ బాలిక శ్వాస కోస సమస్యతో ఆస్పత్రిలో చేరగా.. ఆమెకు గొంతు సంబంధిత పక్షవాతం వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.
ఆపరేషన్ చేసి గొంతులో గొట్టం అమర్చి శ్వాస తీసుకునేలా చేశామని, ఈ పరిస్థితి 13 నెలల పాటు కొనసాగిందని వైద్యులు వెల్లడించారు.