జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Old woman cry

Old Woman Cry : అరకులోయ, జూన్ 18, (త్రినేత్రం న్యూస్) : ఆధునిక డిజిటల్ యుగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొందరి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. దీనికి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం, లోతేరు పంచాయతీ పరిధిలో నివసిస్తున్న స్వాభి పెంటమ్మ (65) జీవితం నిదర్శనంగా నిలుస్తోంది.
భర్త మోస్య మరణించడంతో ఒంటరిగా జీవిస్తున్న పెంటమ్మకు అండగా నిలిచే కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వయోభారం కారణంగా శారీరకంగా శ్రమించి జీవనం సాగించే స్థితిలో కూడా ఆమె లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వృద్ధాప్య లేదా ఒంటరి మహిళ పెన్షన్ ఆమెకు ప్రధాన జీవనాధారంగా ఉండాల్సి ఉంది. అయితే, ఆమె వద్ద ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి ప్రాథమిక గుర్తింపు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదు. గుర్తింపు పత్రాల లేమి కారణంగా ఆమెకు రావాల్సిన పెన్షన్ నిలిచిపోయింది.
పింఛన్ లేకపోవడంతో పాటు రేషన్ సరుకులు కూడా అందకపోవడంతో పెంటమ్మ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదరించే వారు లేక, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఆమె రోజులు గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణమే ఆమెకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మంజూరు చేసి, అర్హత మేరకు వృద్ధాప్య లేదా ఒంటరి మహిళ పెన్షన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలులో సాంకేతిక సమస్యలు నిరుపేదలకు అడ్డంకిగా మారకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page