
Khanapur : డిండి (గుండ్ల పల్లి) జూన్ 17, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలో గత మూడు సంవత్సరముల నుండి మూతబడి ఉన్నటువంటి ఎం పి పి యు ఎస్ ఖానాపూర్ పాఠశాలను బుధవారం పునః ప్రారంభించడం జరిగింది. పాఠశాల మళ్ళీ ప్రారంభించడం సంతోషముగా ఉన్నదని గ్రామ సర్పంచ్ తిప్పర్తి ప్రతిమ విజయేందర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతుల గురించి మాట్లాడుతూ అన్ని వనరులనువినియోగించుకొని ఇట్టి అవకాశాన్ని గ్రామంలోని విద్యార్థులుసద్వినియోగించుకొని ఉన్నత ప్రయోజకులు కావాలని గ్రామ సర్పంచ్ శ్రీమతి తిప్పర్తి ప్రతిమ విజయేందర్ రెడ్డి కోరారు. మూతపడినటువంటి ప్రాథమికోన్నత పాఠశాల తో పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలను కూడా బుధవారం రోజు ప్రారంభించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేయడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో గౌరవ మండల విద్యాధికారి పగిడిపాటి నర్సింహ మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోప్య నాయక్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్ , గ్రామ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు మరియు గ్రామ పెద్దలుపాల్గొన్నారు.
పాఠశాల పున: ప్రారంభం రోజే 20 మంది విద్యార్థులు పాఠశాలలో జాయిన్ కావడం జరిగినది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe