
Shakti Yantra to Jagan : అస్సాం రాష్ట్రం” లో “గౌహతి దగ్గర నీలాంచల్” కొండమీద కొలువై ఉన్న దేశంలో “13వ శక్తి పీఠంగా పేరుగాంచిన శ్రీ కామాఖ్య మాత అమ్మవారిని రాజమండ్రి రూరల్ వైసిపి…మాజీ కోఆర్డినేటర్ గిరజాల బాబు ఇటీవల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం తాడేపల్లి లో వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ” గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి వేద పండితుల ఆధ్వర్యంలో అక్కడ నుండి తీసుకొచ్చిన అమ్మవారు ధరించిన శాలువా, మాల, అక్షింతలు, కుంకుమ, శక్తి యంత్రము జగన్ కి గిరజాల అలంకరించి బహుకరించారు.”
రాబోయే ఎన్నికల సంగ్రామంలో దుష్టపన్నాగాలు, కుతంత్రాలు ఎదుర్కొని మరలా ” ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యాధికారం పొందాలని” కోరుకుంటూ ” పండితుల సలహా” మేరకు శ్రీశ్రీశ్రీ కామాఖ్య, శ్రీ రాజశ్యామలా దేవి సమక్షంలో శ్రీ రాజ శ్యామల యాగం చేయించడం జరిగినది. ఆ యాగములో ” అమ్మవారిని అలంకరించినా మహాశక్తివంతమైన శాలువా నీ ” ఈరోజు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి పండితులు ద్వారా అమ్మవారి కుంకుమ, అక్షింతలు, శక్తి యంత్రము, శాలువా ను జగన్మోహన్ రెడ్డి ” మెడలో అలంకరించి అమ్మవారి ఆశీస్సులు పండితుల ద్వారా అందజేశరు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మాజీ కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ గిరజాల బాబు మరియు APIDC మాజీ స్టేట్ డైరెక్టర్ కానుబోయిన సాగర్, ఎంపీటీసీ ఆకుల సుధాకర్, కొక్కిరాల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe