
MLA Songa Roshan : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 16; చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన యేసు తిరుహృదయ నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమానికి చింతలపూడి డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు ఆధ్యాత్మిక భావనతో నిర్మించిన ఈ దేవాలయం విశ్వాసానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విచారణ గురువులు, దాతలు,స్థానిక ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe