జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Chalo Collectorate to protest

ప్రజలు అందరూ కలిసి పాల్గొని కార్య క్రమాన్ని విజయ వంతం చేయాలి.. తూం బుచ్చిరెడ్డి

Chalo Collectorate : డిండి (గుండ్ల పల్లి) జూన్ 08, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశ అధ్యక్షులు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఎండీ మైనోద్దీన్ వహించగా
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చి రెడ్డి మాట్లాడుతూ జూన్ 10వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపు అదేవిదంగా వ్యవసాయానికి సంబంధించి మందు బస్తాల పైన కూడా అధిక ధరలు పెంచుతూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పెంచిన ధరలను తగ్గించాలని నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాకి డిండి మండలంలోని కామ్రేడ్స్ అంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ప్రజా సంఘాల మహాసభలు నిర్వహించి ప్రజా సంఘాలను బలోపేతం చేయాలని భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,మండల సహాయ కార్యదర్శులు బొల్లె శైలేష్,తిప్పర్తి విజేందర్ రెడ్డి,హనుమండ్ల కేశవులు,నూనె వెంకటేశ్వర్లు,సోమిడి శ్రీను,ఎల్మినేటి హుసేన్,ఎనమల్ల నవీన్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page