జూలై 23, 2026
TRINETHRAM NEWS
Collector Nishanti Government development

Collector Nishanti : అల్లూరి సీతారామరాజు జిల్లా, జూన్ 7, (త్రినేత్రం న్యూస్): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల (సీడబ్ల్యూఎస్ఎన్) విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ నిషాంతి. టి తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ (ఏపీసీ) ఆధ్వర్యంలో, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ సమన్వయంతో దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాలు, విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని 11 మండలాలకు చెందిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వివిధ రకాల సహాయక పరికరాలు అందజేశారు. ఫిజికల్ డిసబిలిటీ కలిగిన 6 మంది, సెన్సరీ డిసబిలిటీ ఉన్న 4 మంది, న్యూరో డెవలప్‌మెంటల్ డిసార్డర్స్‌తో బాధపడుతున్న 3 మంది, క్రానిక్ న్యూరోలాజికల్ సమస్యలు ఉన్న 2 మంది, అంధత్వ సమస్యలు కలిగిన 3 మంది, ఇతర కేటగిరీలకు చెందిన విద్యార్థులతో కలిపి మొత్తం 185 మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక కిట్లు, విద్యా సామగ్రిని జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మార్చి నెలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం వైద్య నిపుణులతో ప్రత్యేక మెడికల్ అసెస్‌మెంట్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో పిల్లల అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన సహాయక పరికరాలపై వైద్యుల సిఫార్సులు తీసుకుంటామని చెప్పారు.
వైద్యుల నివేదికల ఆధారంగా ALIMCO సంస్థకు వివరాలు పంపించి, ప్రభుత్వం ద్వారా వీల్‌చైర్లు, వాకింగ్ స్టిక్స్, జనరల్ ఎడ్యుకేషన్ కిట్లు, అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్లను ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పీబీకే పరిమళ, సమగ్ర శిక్షా అధికారి స్వామినాయుడు, రిసోర్స్ పర్సన్లు, సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page