
Monsoon : త్రినేత్రం న్యూస్ : Jun 02, 2026, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు నుంచి మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యమయ్యాయి.
ప్రస్తుతం రుతుపవనాల రాకకు అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. అయితే ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
