
Good News : త్రినేత్రం న్యూస్ : Jun 02, 2026, దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ‘సార్థక్ పీడీఎస్’ (SARTHAK PDS) పథకానికి ఆమోదం తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికత ఆధారితంగా మార్చేందుకు రూ.25,530 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.
ఈ పథకం ద్వారా గోదాముల నుంచి రేషన్ దుకాణాల వరకు ధాన్యం రవాణాను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తారు. ఆధార్, బయోమెట్రిక్ ధృవీకరణను బలోపేతం చేసి నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టనున్నారు. రేషన్ కార్డుల నిర్వహణ, కొత్త దరఖాస్తుల ప్రక్రియను కూడా సరళతరం చేయనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
