WhatsApp Image 2024 01 30 at 10.04.43 PM
Trinethram News : హైదరాబాద్ : జనవరి 30
ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ మంగళవారం బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
తెలంగాణలో విద్య అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలు, వ్యవసాయంలో అధునా తన సాంకేతిక విధానాల పైనా ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది.
హైదరాబాద్ నుంచి అస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగు పడాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
