
జుట్టు సతీష్ నల్గొండ ఈ సి మెంబర్ బీ ఎస్ పి పార్టీ.
Juttu Satish : దేవరకొండ డివిజన్ మే 31, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా కచ్చితంగా అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నల్గొండ ఈసీ మెంబర్ సతీష్ బహుజన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు..నిరుద్యోగులు, పేదలు, మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, వెంటనే అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు మరియు అంశాలు:హామీలఅమలు:—
ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇచ్చిన హామీలను వెంటనే కార్యరూపం దాల్చాలి.నిరుద్యోగుల సమస్యలు: నిరుద్యోగ భృతి మరియు జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై స్పష్టతనిచ్చి ఉద్యోగాలు కల్పించాలి.సంక్షేమ పథకాలు: కొత్త పెన్షన్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
