
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జుట్టు సతీష్ బహుజన నల్లగొండ ఈసీ మెంబర్ .
Juttu satish : దేవరకొండ డివిజన్ మే 23, త్రినేత్రం న్యూస్. రైతులు చెమటోడ్చి పండించిన పంటకు కొనుగోలు కేంద్రాల్లో (PPC) ఏర్పడుతున్న జాప్యం, తేమ పేరుతో జరుగుతున్న కోతలు, మరియు అకాల వర్షాల వల్ల పంట నష్టపోతున్న రైతులనువెంటనే ఆదుకోవాలని పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు: నిరంతర కొనుగోళ్లు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన తెరిచి, చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోందని .గిట్టుబాటు ధర & బోనస్: క్వింటాలుకు ప్రకటించిన కనీస మద్దతు ధరతో పాటు, సన్నాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన బోనస్ మొత్తాన్ని రైతులకు ఎలాంటి షరతులు లేకుండా అందించాలని స్పష్టం చేస్తున్నారు.
రక్షణ చర్యలు: అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, తదితర రక్షణ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని అన్ కోరుతున్నారు.రైతుల ఇబ్బందులు: మిల్లర్లు, అధికారుల కుమ్మక్కుతో తేమ శాతం, తాలు పేరిట అన్నదాతలకు జరుగుతున్న మోసాలను అరికట్టాలని, తక్షణమే డబ్బులు జమ చేయాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

