జూలై 23, 2026
TRINETHRAM NEWS
Vishal criticizes CM

Vishal criticizes CM : త్రినేత్రం న్యూస్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎట్టకేలకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ తీసుకుంటోన్న కొన్ని సంచలన నిర్ణయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ మధ్యన మద్యం షాపుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. విజయ్ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు, హీరోల సైతం కొనియాడారు.

ముఖ్యంగా హీరో విశాల్ విజయ్ కు థ్యాంక్స్ చెబుతూ ఓ పెద్ద ట్వీట్ కూడా పెట్టాడు. అయితే ఇది జరిగి వారం రోజులు కాలేదు. ఇదే విశాల్ ఓ విషయంలో సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడది తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాట కొత్త మంత్రి వర్గం కొలువు తీరింది. ఇటీవలే పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయగా.. వారికి ఇటీవలే శాఖలను కూడా కేటాయించారు విజయ్. అయితే ఇందులో టోగ్రఫీ శాఖను రాజ్ మోహన్ కు కేటాయించడంపై విశాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page