TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : మొన్నటి వరకు మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల ఆందోళనలతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… తాజాగా హౌజ్ కీపింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు..

”మాపై మీ కక్ష” అంటూ సచివాలయంలో జగన్ సర్కార్‌పై హౌజ్ కీపింగ్ ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) అధికారంలోకి వచ్చాక తమకు జీతాలు పెంచుతామని, ఆప్కోస్‌లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అయితే అప్కాస్‌లో చేర్చినా నేటికీ జీతాలు నెలలో 20వ తేదీన వస్తున్నాయని అన్నారు. అప్కోస్‌లోకి వచ్చాక ఇచ్చే పదిహేను వేలులో కటింగ్‌లు పోను కేవలం రూ.13000 మాత్రమే చేతికి ఇస్తున్నారన్నారు..

పీఎఫ్ అకౌంట్‌లో సొమ్ము సరిగా జమ చేయడం లేదని… తమ వాటా సొమ్ము మాత్రం కట్ అవుతున్నాయన్నారు. తాజాగా మొత్తం 154 మందిలో 139 మందిని మాత్రమే ఉంచుతామని చెపుతున్నారన్నారు. తొలగించే 15 మంది ఎవరో చెప్పాలని…. ఎవరు తప్పుకోవాలని ప్రశ్నించారు. 9 సంవత్సరాలుగా అందరం ఒకే చోట కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. బయట పనులు… కాంట్రాక్టర్ చెప్పినా అవి కూడా చేస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలు సమయంలో అదనపు మ్యాన్ పవర్ లేకుండానే ఉదయాన్నే వచ్చి అర్ధరాత్రి వరకు పని చేస్తున్నామని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇంత సేవ చేస్తున్న తమను అందరినీ విధుల్లో కొనసాగించాలని.. తప్పించవద్దని కోరారు. తమలో ఓ 15 మందిని తప్పించడానికి అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు..