
MLA Expressed Solidarity : త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 4: నెల్లూరు జిల్లా :కావలి… నెల్లూరు జిల్లా, కవలిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుకుంటూ జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ ప్రత్యేక మొక్కు మొక్కుకున్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ముసునూరు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని శ్రీనాథ్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని పాదయాత్రను ప్రారంభించి శ్రీనాథ్‌కు సంఘీభావం ప్రకటించారు. శ్రీనాథ్ సంకల్పం విజయవంతం కావాలని, సురక్షితంగా తిరుమల చేరుకుని మొక్కులు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనాథ్‌కు మద్దతు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

