Minister Ponnam Prabhakar : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు

TRINETHRAM NEWS
Minister Ponnam Prabhakar pays tribute

Minister Ponnam Prabhakar : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ గర్వకారణమైన ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావీరుడు,బహుజన రాజ్యస్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ సామాన్య ప్రజల కోసం,ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు.

ఆయన స్థాపించిన బహుజన రాజ్యస్థాపన చేసి స్వరాజ్య భావన, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు.పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, నాయకత్వ గుణాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనయన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రజా పాలన ప్రభుత్వం బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందని, పాపన్న గౌడ్ స్ఫూర్తితోనే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా పాపన్న గౌడ్ సేవలను స్మరించుకుంటూ, యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top