
Sitaramula Kalyanam : త్రినేత్రం న్యూస్ : Apr 01, 2026, ఆంధ్రప్రదేశ్ : వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఈ మేరకు టీటీడీ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశాయి. సా.6.30 నుంచి రాత్రి 8.30 వరకు కళ్యాణోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమానికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. కళ్యాణ వేదికకు ఎదురుగా 120 గ్యాలరీలు ఏర్పాటు చేసింది. గ్యాలరీలో కూర్చునే భక్తులకు లడ్డూ, తీర్థ ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, మజ్జిక ప్యాకెట్లు, తాగునీరు అందించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

