
Mission Bhagiratha Water Supply : దేవరకొండ డివిజన్ మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. నాంపల్లి మండలం బట్లపల్లి (ఎస్‌డబ్ల్యూ లింగోటం) పంప్ హౌస్‌లోని 440 స్థాయి పంపుల బేరింగ్‌లు విరిగిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోనున్నాయి.దీంతో దేవరకొండ నియోజకవర్గం పరిధిలో మిషన్ భగీరథ నీళ్లు అందుకునే మండలాలకు అంతరాయం కలగనుంది.
ముఖ్యంగా చింతపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో ప్రభావం కనిపించనుంది. ఈ కాలంలో త్రాగునీటి కొరత తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సర్పంచులు ప్రతి గ్రామపంచాయతీలో ముందుగానే త్రాగునీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అలాగే అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయాన్ని మల్లేపల్లి ఉప విభాగ మిషన్ భగీరథ గ్రిడ్ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజనీరు వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

