Dulla Panchayat Staff : దుళ్ల పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం

TRINETHRAM NEWS
Dulla Panchayat staff and sanitation workers

గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య ఆధ్వర్యంలో జ్ఞాపికలు ప్రధానం…

Dulla Panchayat Staff : త్రినేత్రం న్యూస్, కడియం, మార్చి 26 : కడియం మండలం దుళ్ల పంచాయతీ వద్ద సర్పంచ్ కొండపల్లి పట్టియ్య ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం జరిగింది..2021 నుండి 2026 కాలం గాను పాలకవర్గం కాలం ముగింపు సందర్భంగా గురువారం ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ కొండపల్లి పట్టియ్య దంపతులు తొలుత పారిశుద్ధ్య కార్మికులకు సాలువాలు , పూలమాలలు వేసి, మెమోంటో లు అందించి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

సర్పంచి పట్టియ్య మాట్లాడుతూ తమ పాలక వర్గం ఆధ్వర్యంలో ఐదేళ్లు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలను అభినందించారు. అలాగే సర్పంచ్ దంపతులు వార్డు సభ్యులు, ప్రస్తుత, గత పంచాయతీ సిబ్బంది, ప్రస్తుత కార్యదర్శి బండారు, తాతారావు, గత కార్యదర్శి లు మహేష్, రవి శంకర్ లను సాలువాలు తో సత్కరించి మెమోంటోలు అందించారు.

అలాగే పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వార్డు సభ్యులు, ఎంపిటిసి సభ్యులకు దుస్తులను సర్పంచ్ పట్టియ్య, విజయలక్మి దంపతులు చేతులు మీదుగా అందజేశారు. అలాగే సర్పంచి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాసరావు లను వార్డు సభ్యులు, పార్టీలకతీతంగా స్థానిక నాయకులు పూల మాలలు వేసి , సాలువాలు తో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి గ్రామస్తులు తో పాటు తనకు సహకరించిన పాలక మండల సభ్యులు అందరూ సహకరించినందుకు అలాగే గ్రామ సచివాలయ సిబ్బందికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పుత్సల బసవ లింగం, మాజీ సర్పంచ్ గుర్రపు కొండయ్య మాష్టారు, మాజీ ఉప సర్పంచ్ తాతపూడి బాబీ, కంటిపూడి సాయి, కూటమి నాయకులు సూరపురెడ్డి భరత్, తూము శ్రీనివాస్, ముమ్మిడీ దేవి నాగేశ్వరరావు, చిట్టూరి వెంకన్న చౌదరి, కంటిపూడి శ్రీనివాస్, ప్రత్తి ప్రకాష్, కులపాకల సత్తిబాబు , చింతా శ్రీనివాసు , మెర్ల అయ్యప్ప, జాస్తి చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top