
Gas Shortage : పి ఏ పల్లి మార్చ్25, త్రినేత్రం న్యూస్. పీఏ పల్లి ఉమ్మడి మండలం ఘాట్ నెమలిపురం గ్రామములో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశములు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ కూలీల సమస్యలను తెలుసుకొని ఉపాధి కూలీల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం పేరుతో వంట గ్యాస్ కొరత సృష్టించి ఉపాధి కూలీలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని కట్టెల పోయి తో వంటలు చేసుకుందామన్నా కట్టెపుల్లలు తెచ్చుకుందా మన్నా ఫారెస్ట్ అధికారులు అడ్డు వచ్చివేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆరు వారాలు పనిచేసిన డబ్బులు రాకపోవటం వల్ల కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఉపాధి హామీ పనికి రావడానికి ఇష్టపడటం లేరని బిజెపి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం వి బి జి రామ్ జ చట్టం కూలీలకు డబ్బులు రాకుండా చేసే చట్టం ఈ కొత్త చట్టమని వారు తెలిపారు పని ప్రదేశంలో రెండు పూటల ఫోటోలు తీయడం వల్ల కూలీలు పనికి రాకుండా పోతున్నారని పని ప్రదేశంలో ఫోటోలు రాకపోవడం వల్ల కూలీలు పంపించడం జరుగుతుంది.
కూలీలకు పని లేకుండా పోతుందని ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకంగా కూలీలు ఐక్యంగా ఉద్యమించాలని ఉపాధి కూలీలకు వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలని వంట చేసుకోవటానికి కట్టెపుల్లలు తెచ్చుకోవటానికి ఫారెస్ట్ అధికారులు అనుమతించాలని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రోజు కూలి 600 ఇవ్వాలని కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని పాత చట్టం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కోన్ రెడ్డి లక్ష్మయ్య ఉపాధ్యక్షులుగా యాదయ్య చెన్న పోయిన వెంకటరమణ రుద్రాక్ష యాదగిరి సహాయ కార్యదర్శి అన్ మణికంఠ సత్తయ్య కమిటీ సభ్యులు ఉల్లంకొండ పద్మ కురుమేటి వెంకటేశ్వర్లు చింతకాయల మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

