జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Kakani Govardhan Reddy Criticism

Kakani Govardhan Reddy : నెల్లూరు జిల్లా : మార్చి 25: (త్రినేత్రం న్యూస్) ; నెల్లూరులో పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి పడవలు దొంగిలించబడడంపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ చోరి వెనుక తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
స్థానిక మత్స్యకారులు తమ ప్రాణాలు తెగించి తమిళనాడు పడవలను తీసుకువచ్చి వాళ్లకు అప్పగిస్తే, ఆధీనంలో ఉన్నవి ఎలా మాయమయ్యాయని మండిపడ్డారు. అదేవిధంగా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. చోరీ విషయంలో మత్స్యకారులకు వైసిపి అండగా ఉంటుందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page